అన్నయ్యా… వదిన వచ్చింది చూడు.. వీడియో వైరల్‌


బాలీవుడ్ నటులు కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ ల మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని సినీ వర్గాలు కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీడియో ఒకటి తెగ నవ్వులు పూయిస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన ‘లవ్ ఆజ్ కల్ – 2’ నేడు రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో కార్తీక్ ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఇద్దరు అబ్బాయిలతో కలిసి కార్తీక్ ఫుట్ బాల్ ఆడుతూ ఉండగా, వెనుక నుంచి సారా వచ్చింది. దీన్ని చూసిన ఓ బాలుడు… “అన్నయ్యా… వదిన వచ్చింది చూడు” అని చెప్పగానే కార్తీక్ ఒకింత షాక్ అయ్యాడు. ఇది విన్న సారా నవ్వుతూనే… ‘వదినా’ అని ఎవరు పిలిచారు? అని బాలుడి వైపు వెళుతూ… “అతనే కదా నిన్ను అలా పిలవమన్నాడు” అంటూ కార్తీక్ ను కొట్టేందుకు ప్రయత్నించింది.

ఇక ఈ వీడియోను షేర్ చేసిన కార్తీక్, దానికి సారా బుంగమూతి పెట్టుకున్న ఎమోజీని జత చేయగా, ఈ వీడియో ఇప్పుడు ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో ఓ కార్యక్రమంలో సారాను తన చేతులతో ఎత్తుకున్న కార్తీక్, ఆమెను స్టేజ్ పైకి తీసుకెళ్లాడు. ఆపై కార్తీక్ కు స్వయంగా వంట చేసి తినిపిస్తున్న సారా వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. దీంతో సహజంగానే వీరిద్దరూ లవ్ లో ఉన్నారని అభిమానులు అంటున్నారు. దానిపై వీరు స్పందించక పోవడం విశేషం.

View this post on Instagram

Bhabhi kisko bola ☺️

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on