HomeTelugu Reviews'హాయ్‌ నాన్న' మూవీ రివ్యూ

‘హాయ్‌ నాన్న’ మూవీ రివ్యూ

Hi Nanna Movie Review
నాని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. ప్రేమ, పెళ్లి, పిల్లలు ఈ లైఫ్ సర్కిల్ నలిగిపోయిన విరాజ్ (నాని), యష్ణ (మృణాల్ ఠాకూర్), మహి (‘బేబీ’ కియారా ఖన్నా)ల మానసిక సంఘర్షణే సినిమా. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ ఈ మూవీపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేశాయి. ఈ క్రమంలో ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎంతవరకూ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..

విరాజ్ (నాని) ముంబై‌లో ఫేమస్ ఫొటోగ్రాఫర్. అతనికి ఆరేళ్ల కూతురు మహి (బేబీ కియారా ఖన్నా) అంటే పంచ ప్రాణాలు. మహి పుట్టుకతోనే ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు చనిపోతుందో తెలియదు కాబట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. క్షణం క్షణం నరకాన్ని అనుభవిస్తుంటాడు విరాజ్. మహిని నిద్రపుచ్చేప్పుడు కథలు చెప్తుంటాడు విరాజ్. అయితే అమ్మలేని కథలే చెప్తుండటంతో.. నాకు అమ్మ ఉన్న కథే చెప్పమని మొండికేస్తుంది మహి.

అమ్మ కథ చెప్తే మహి తట్టుకోలేదని.. చెప్పడానికి ఇష్టపడడు విరాజ్. దీంతో మహి ఇంట్లో నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ప్రమాదం బారిన పడటంతో యష్ణ (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. విరాజ్‌కి ఫోన్ చేసి మహిని అప్పగిస్తుంది. ఆ సందర్భంలో విరాజ్.. మహికి తన గతంలో ఉన్న అమ్మ కథని చెప్పాల్సి వస్తుంది. ఆ కథలో అమ్మ.. వర్ష (ఎవరనేది సస్పెన్స్) అయితే.. ప్రజెంట్ అమ్మగా యష్ణను ఊహించుకుని విరాజ్ చెప్పిన కథ వింటుంది మహి.

అయితే విరాజ్ చెప్పిన కథలో.. ధనవంతురాలైన వర్షని విరాజ్ తొలి చూపులో ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. కూతుర్ని కనడం.. ఆ తరువాత వర్షకి యాక్సిడెంట్ అవ్వడం.. భర్త, కూతుర్ని వదిలేసి ఆమె వెళ్లిపోవడంతోనే కథని ఆపేస్తాడు. ఆ తరువాత ఏమైంది? అసలు వర్ష ఎవరు? యష్ణ ఎవరు? విరాజ్‌తో ఎందుకు విడిపోయింది? పాపని ఎందుకు వదిలేసింది? ఆ పాప కారణంగా విరాజ్, వర్షల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నదే కథ.

అమ్మ గురించి నానీ చెప్పిన ఈ ప్రేమకథ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ఈ సినిమాలో విరాజ్, యష్ణ, మహి పాత్రలే కథలో మెయిన్‌ పాత్రలు. ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. గొడవలు.. విడిపోవడాలు.. కథాంశం కొత్తదేమీ కాదు. జెర్సీ, సంతోషం, ఖుషీ ఇలా చాలా సినిమాల్లో కనిపించే కామన్ పాయింటే ఇది. కానీ ఈ సినిమాలో అమ్మ పాత్రని దర్శకుడు శౌర్యువ్ మలిచిన తీరు చాలా కొత్తగా అనిపిస్తుంది. తండ్రీ కూతుళ్ల ఎమోషన్‌కి పెద్ద పీఠ వేస్తూనే.. అమ్మకథలో మలుపుల్ని హృద్యంగా చూపించారు.

విరాజ్ పాత్రలో నాని ఎంత విజ‌ృంభిస్తున్నా.. స్క్రీన్‌పై ఎమోషన్స్ అద్భుతంగా పండిస్తున్నా.. కథ ముందుకు వెళ్లే కొద్దీ… నాని ఏంటి?? మళ్లీ ఇలాంటి రొటీన్ సినిమానే చేస్తున్నాడేంటబ్బా అనుకునేలోపే.. యష్ణ- వర్ష పాత్రల తాలూకా ట్విస్ట్ రివీల్ అయ్యేసరికి.. హో నాని ఇందుకా? ఈ కథను ఒప్పుకున్నది అని అనిపిస్తుంది. ఆ ట్విస్టే సినిమాకి కీలకం. ఎంట్రీలోనే స్టార్ డైరెక్టర్ అనిపించుకోవడానికి శౌర్యువ్‌‌కి ఈ సినిమా బంపరాఫర్ అనే చెప్పాలి.

కొత్త దర్శకుడు అయినప్పటికీ.. కథను బాగా ప్రజెంట్‌ చేశాడు. అసభ్యతకి తావు ఇవ్వకుండా.. అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. కథలో మెయిన్ పాయింట్ రివీల్ అయిన తరువాత.. కథ వేగం తగ్గింది. పాత్రల పరంగా.. నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఆయా పాత్రల్లో జీవించేశారు. ముగ్గురూ పోటీ పడి నటించారు. ఈ ముగ్గురి కాంబోలో సీన్లు అయితే.. గుండెల్ని పిండేస్తాయి. ఈ సినిమాలో కూడా విరాజ్ పాత్రలో నాని ఒదిగిపోయాడు.

మృణాల్ ఠాకూర్ అద్భుతంగా చేసింది. సీతారామం తరహాలో మరోసారి గుర్తిండిపోయే పాత్ర చేసింది. హీరోయిన్స్‌ని గ్లామర్ డాల్‌గా మాత్రమే చూపిస్తున్న ప్రజెంట్ ట్రెండ్‌లో మరోసారి తన పాత్రపైనే నడిచే రోల్‌ని దక్కించుకోవడమే కాకుండా.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది మృణాల్ ఠాకూర్. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. చిన్నారి బేబీ కియారా అయితే సినిమాకి ప్రధాన బలం. సినిమాకి మెయిన్ స్ట్రెంత్ అయిన కోర్ ఎమోషన్‌ని పండించడంలో పాప జీవించేసింది.

సీనియర్ నటుడు జయరామ్ పాత్ర కూడా ట్విస్ట్‌లతో సాగుతుంది. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ ఉంది. ఉందంటే ఉందంతే.. మెరుపుతీగలా ఓ సీన్‌లో అలా కనిపించి మాయం అవుతుంది. ఇంకో సాంగ్‌లో కనిపిస్తుంది. మిగంతా నటీనటులు తమ పరిది మేరకు నటించారు. మ్యూజిక్ పరంగా.. హేషమ్ అబ్దుల్ వాహబ్ పర్వాలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu