HomeTelugu Trending'దసరా' విలన్‌ నిశ్చితార్థం ఫొటో వైరల్‌

‘దసరా’ విలన్‌ నిశ్చితార్థం ఫొటో వైరల్‌

dasara actor shine tom chac

నాని హీరోగా నటించిన ‘ద‌స‌రా’ సినిమాలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు తనూజతో నిశ్చితార్థం చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా సోషల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ వేడుక నుండి అద్భుత‌ క్షణాలకు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేసాడు.షైన్ టామ్ చాకో ఈ సంద‌ర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. చాకో -త‌నూజ జంట ఎంతో అందంగా ఉన్నారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ ఫోటోషూట్ వైరల్‌గా మారింది.

వీరి నిశ్చితార్థ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యుల హాజరైయ్యారు. పింక్ షర్ట్ – తెలుపు ప్యాంటులో టామ్ చాకో మెరుస్తూ కనిపించాడు. తనూజ అదే రంగులో లెహంగా ధరించింది. తనుజ ఒక మోడల్. షైన్‌కి ఇప్పటికే ఓ ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆయనకు ఇది రెండో పెళ్లి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu