
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘హయ్ నాన్న’. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ టీజర్ ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో అందమైన ప్రేమ జంట మధ్యలో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మృణాల ఠాగూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక వీరి కలయికలో రాబోతున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రొజెక్ట్‌పై మంచి హైప్సే ఉన్నాయి. అయితే సినిమా నుంచి థర్డ్ సాంగ్ అమ్మాడి నవంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఆ పాటకు సంబంధించిన స్టిల్ విడుదల చేశారు. అందులో నాని మృణాల్ ఠాగూర్ హత్తుకుని ఉన్న నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ జోడి మధ్యలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లుగా అనిపిస్తుంది.
శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఈ పాన్ ఇండియా సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించగా, మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి మరియు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా కీలక పాత్రను పోషిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.














