హిందీ రీమేక్‌లో మెగా హీరో.!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ కష్టాల్లో ఉందనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు వరుస ఫ్లాపులు రావడంతో ఆలోచనలో పడ్డారు మెగా కాంపౌండ్ పెద్దలు. అందుకే ఇకపై తేజ్ చేయబోయే చిత్రాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాత అల్లు అరవింద్. తేజ్ కోసం కథల్ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారాయన.

అందులో భాగంగానే తాజాగా విడుదలై విజయం సాధించిన హిందీ సినిమా ‘గల్లీ బాయ్’ రీమేక్ హక్కులు కొనే యోచనలో ఉన్నారట. ఈ సినిమాను తేజుతో చేయాలనుకుంటున్నారట. మరి ఈ బిగ్ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. ఇకపోతే తేజ్ ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘చిత్రలహరి’ అనే సినిమా చేస్తున్నాడు.