‘హ‌లో’ అంటున్న అఖిల్‌?

అక్కినేని అఖిల్ న‌టిస్తున్న రెండో సినిమా టైటిల్ ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌క‌టించ‌నేలేదు. ఈ సినిమా టైటిల్ విష‌య‌మై బోలెడంత స‌స్పెన్స్ ర‌న్ అవుతోంది. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నా అవేవీ క‌న్ఫామ్ కాలేదు. చిత్ర‌యూనిట్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న లేనేలేదు. దీంతో అక్కినేని అభిమానుల్లో ఒక‌టే క్యూరియాసిటీ. అస‌లు ఆ టైటిల్ ఏంటి? ఎప్పుడు ప్ర‌క‌టిస్తారు? అన్న డైలెమ్మా న‌డుస్తోంది. నాగార్జున పుట్టిన‌రోజు వేళ అఖిల్ టైటిల్ ప్ర‌క‌టిస్తారంటూ ఇప్ప‌టికే ప్ర‌చారమైంది. 
 
లేటెస్టుగా అఖిల్ సినిమా స్టిల్ ఒక‌టి అంత‌ర్జాలంలో లీకై వాడి వేడి చ‌ర్చ‌కు తెర‌తీసింది. అఖిల్‌ని విక్ర‌మ్‌.కె.కుమార్ మోస్ట్ స్టైలిష్ యాక్ష‌న్ హీరోగా ఆవిష్క‌రిస్తున్నాడ‌న్న టాక్ వినిపించింది. క‌థాంశం ప‌రంగా ఎప్పుడూ ఏదో ఒక కొత్త‌ద‌నం ట్రై చేసే విక్ర‌మ్‌.కె ఈ ప్రాజెక్టును అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని ప‌ని చేస్తున్నాడు. టైటిల్ అంతే కొత్త‌గా ఉండాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. అయితే చిత్ర‌యూనిట్ సోర్స్ ప్ర‌కారం.. ‘హ‌లో’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే కింగ్ బ‌ర్త్ డే ఆగ‌ష్టు 22న ఆ టైటిల్‌నే ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.