
HIT 3 Villain Name:
హిట్ 3 సినిమా చూసినవారికి రెండో భాగంలో వచ్చిన విలన్ గుర్తుండే ఉంటాడు. అదే మన ప్రతీక్ స్మితా పాటిల్. అసలు జీవితంలో అతని కథ సినిమాల కన్నా ఎక్కువగా మలుపులు తిరిగిన డ్రామా ఉంటుంది.
ప్రతీక్ బాలీవుడ్ దిగ్గజ నటి స్మితా పాటిల్, రాజకీయ నాయకుడు రాజ్ బబ్బర్ కుమారుడు. కానీ తల్లి స్మితా పాటిల్ తనను పుట్టిన సమయంలోనే చనిపోవడం, తండ్రితో సంబంధాలు మంచిగా లేకపోవడం వల్ల చిన్నప్పటినుంచి మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాడు. తన నాన్నమ్మ, తాతయ్యల వద్దే పెరిగాడు.
View this post on Instagram
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నేను ఓ రేంజ్ అడిక్ట్ లా మారిపోయాను. చాలా విద్యాసంస్థల నుంచి తూర్పారబడ్డా. రియల్ గా ఒక మెనేస్ లా జీవించేదాన్ని,” అని అన్నాడు. సుబాష్ ఘాయ్ నిర్వహించే విస్లింగ్ వుడ్స్ యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లినా, అక్కడి నుంచీ బయటకు పంపించారట.
అతడి జీవితంలో అతిపెద్ద నష్టమే సంజయ్ లీలా భన్సాలీ తీసిన “సావారియా” సినిమాలో అవకాశాన్ని కోల్పోవడమే. డ్రగ్ రిహాబ్‌లో ఉండడం వల్ల ఆ అవకాశం తప్పిపోయిందట.
తన తాతయ్య, నాన్నమ్మ ఎదుర్కొన్న బాధలు చూసి ఇప్పుడు మానసికంగా చాలా బాధపడతున్నాడు. “నాన్నమ్మకు నేను ఇప్పుడున్న ఈ మార్పు చూపించలేకపోయాను. ఆమె గర్వపడేలా మారాను,” అని అన్నాడు.
ఇప్పుడేమో తల్లి పేరు గుర్తుగా ‘ప్రతీక్ స్మితా పాటిల్’ అని తన పేరును మార్చుకున్నాడు. తల్లిని గుర్తు చేసుకుంటూ కొత్త జీవితం మొదలెట్టాడు.
ALSO READ: Subham Movie Review: నిర్మాతగా సమంత బ్లాక్ బస్టర్ అవుతుందా లేక డిజాస్టర్ అవుతుందా?