HomeTelugu Newsఅబార్షన్లపై నిషేధం.. దుస్తులు తీసేసి నటి నిరసన

అబార్షన్లపై నిషేధం.. దుస్తులు తీసేసి నటి నిరసన

4 17

అబార్షన్లపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటి, మోడల్ ఎమిలీ రటజ్‌కౌవస్కి దుస్తులు విప్పేసి నగ్నంగా నిరసన వ్యక్తం చేసింది. ఈమె నిరసనకు పలువురు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ వారం 25 మంది స్వేతవర్ణ పురుషులు (వైట్ మెన్) అలబమాలో అబార్షన్లను వ్యతిరేకిస్తూ ఓటేశారు. అత్యాచారాలు, రక్త సంబంధికుల సంభోగం వల్ల కలిగే గర్భాలను కూడా అబార్షన్ చేయకూడదని తెలిపారు. అధికారంలో ఉన్న ఈ పురుషులు తమకు నచ్చినవి అమలు చేస్తున్నారు. ఇది కచ్చితంగా మహిళలను హరించడమే. మా శరీరాలు, మా ఇష్టం అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన నగ్న ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో మళ్లీ ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. గతేడాది కూడా ఈమె అబార్షన్ల వ్యతిరేక బిల్లును నిరసిస్తూ రోడ్డెక్కింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

అబార్షన్ చేయించుకోవాలా, వద్దా అనేది మహిళల ఇష్టమని, వారిని అణచివేసే ప్రయత్నం చేయొద్దని తెలిపింది. ఇది శ్వేత, నల్ల జాతీయుల మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించింది. పైగా ఈ బిల్లును సమర్ధిస్తూ సంతకాలు చేసినవారంతా శ్వేతవర్ణ పురుషులేనంటూ వివాదం రేపింది. అమెరికాలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించాయి. ఎమిలీతోపాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ నటి సోఫీ టర్నర్ చట్టసభ సభ్యులను ఉద్దేశిస్తూ.. మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది. మా శరీరాలు.. మా ఇష్టం అని ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu