
వీరసింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ నటి హనీ రోజ్. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ చిత్రం తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది హనీరోజ్. ఇప్పుడు ఆమె రాచెల్ (తెలుగులో రాహేలు) అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
రాహేలు మూవీలో హనీరోజ్ ఫస్ట్‌లుక్‌తో అందరికీ షాకిచ్చింది. ఎవరూ ఊహించని పాత్రలో నటిస్తోంది. కత్తి పట్టుకుని మాంసం కొడుతున్నట్లున్న పోస్టర్ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. చుట్టూ దున్నపోతుల తలకాయలతో, మాంసపు ముక్కలతో హనీరోజ్ బీఫ్ కొడుతున్నట్లు తెలుస్తుంది.
వీరసింహా రెడ్డి మూవీలో గ్లామర్ ఒలకబోసింది హనీరోజ్. ఇప్పుడు రాచెల్ మూవీ కోసం సీరియస్ క్యారెక్టర్ చేస్తుంది. మోడ్రన్ డ్రెస్సులో మాంసం కొడుతున్న ఫొటోను హనీరోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఆనందిని బాల డైరెక్టర్.
https://www.instagram.com/reel/CurRklLuXN5/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==













