Homeతెలుగు వెర్షన్కృష్ణ గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ?

కృష్ణ గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ?

How is the Krishna graph how will it be in the next election
ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే..  కృష్ణ అలియాస్ లావు శ్రీకృష్ణ దేవరాయలు. ప్రస్తుతం ప్రజల్లో లావు శ్రీకృష్ణ దేవరాయలు పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో విద్యావేత్త కుటుంబంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు జన్మించారు. అందరూ ఆయనను కృష్ణ అని పిలుస్తూ ఉంటారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కృష్ణ ఆస్ట్రేలియా లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలో  మీడియా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
 
కృష్ణ కుటుంబ నేపథ్యంలోకి వెళ్తే.. ఆయన తండ్రి డా.లావు రత్తయ్య గారు ప్రముఖ విద్యావేత్త మరియు విజ్ఞాన్ పేరుతో పలు విద్యా సంస్థలను స్థాపించారు. కృష్ణ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తమ కుటుంబానికి చెందిన విజ్ఞాన్ విద్యా సంస్థలలో చేరి ప్రస్తుతం ఆ సంస్థల సీయివో గా పనిచేస్తున్నారు. రత్తయ్య గారు సీనియర్ ఎన్టీఆర్ కి అభిమాని. దాంతో ఆయన మొదటి నుంచి తెలుగు దేశానికీ సపోర్ట్ గా ఉంటూ వచ్చారు. అయితే, చంద్రబాబు సీఎం అయ్యాక, రత్తయ్య గారు టీడీపీకి దూరం జరిగారు. 
 
ఆ తర్వాత నుంచి రత్తయ్య గారు కుటుంబం మళ్లీ రాజకీయాల జోలికి రాలేదు. కానీ, రత్తయ్య గారు కొడుకు కృష్ణ కు మాత్రం రాజకీయాల పై ఆసక్తి ఉంది. పైగా వైసీపీ అధినేత జగన్ రెడ్డితో వ్యక్తిగతంగా కృష్ణ కు పరిచయం ఉంది. ఆ పరిచయం కారణంగా కృష్ణ,  జగన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో కూడా జగన్ రెడ్డికి కృష్ణ ఆర్ధిక సాయం చేశారు. ఈ క్రమంలో 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు తటాస్తుల కోటా కింద వైసీపీ నుండి నరసరావుపేట లోక్ సభ కు పోటీ చేసి విజయం సాధించారు. 
 
ఇంతకీ, రాజకీయ నాయకుడిగా కృష్ణ గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో కృష్ణ పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో కృష్ణ పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ కృష్ణకి ఉందా ?, చూద్దాం రండి.  ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి కృష్ణకు తన నియోజకవర్గ పరిధిలోని కొంత మంది ఎమ్మెల్యేలతో విభేదాలు ఉన్నాయని సమాచారం. అందుకే,  కృష్ణ వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉంటే తన సొంత నియోజకవర్గంగా భావించే చిలకలూరిపేట నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. పైగా  కృష్ణ గ్రాఫ్ కూడా పెరుగుతూ వస్తోంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా కృష్ణకి కచ్చితంగా గెలిచే సత్తా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!