
N Convention worth:
హైదరాబాద్ మాదాపూర్ లోని తుమ్మిడి కుంట చెరువు దగ్గర ఉన్న ఎన్ కన్వెన్షన్ నాగార్జునకి చెందినది. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా బృందం.. అది ఆక్రమించిన భూమి అంటూ.. ఎం కన్వెన్షన్ ను కూల్చేసింది. గత కొద్ది రోజులుగా ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది.
అయితే మరోవైపు నాగార్జున మాత్రం అది పట్టా భూమి అని.. దానిమీద కేసు ఇంకా నడుస్తూ ఉండగానే కూల్చేశారు అంటూ.. సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత ఈ ఎన్ కన్వెన్షన్ మొదలైంది. హైదరాబాద్ లో ఉన్న టాప్ ఫంక్షన్ హాల్స్ లో ఇది కూడా ఒకటి.
చిన్న బర్త్డే పార్టీ నుంచి పెద్దపెద్ద పెళ్లిళ్ల వరకు ఇక్కడ చాలా ఈవెంట్లు జరిగాయి. ఒక్కొక్క ఈవెంట్ కి 50,000 నుంచి 15 లక్షల వరకు వస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు ఎంత అన్వెన్షన్ మొదలైన 10 12 ఏళ్లలో నాగార్జున దీనిమీద ఎంత సంపాదించారు అని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ 10 12 ఏళ్లలో నాగార్జున ఎన్కన్వెన్షన్ ద్వారా అక్షరాల 3000 కోట్ల దాకా సంపాదించారట. ఈ వార్త ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేసింది. అంత పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేసాక అది కూల్చేసినా పోయేది ఏముంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.













