హీరోగా రానా తమ్ముడు!

దగ్గుబాటి కుటుంబం నుండి వచ్చిన వెంకటేష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ కూడా హీరోగా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. ఆ తరువాత ఈ కుటుంబం నుండి వచ్చిన రానా నటుడిగా తన సత్తాను చాటుతున్నాడు. హీరోగా పలు సినిమాలతో అలరించడంతో పాటు టీవీ షోలకు హోస్ట్ గా కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో రానా తమ్ముడు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

నిజానికి చాలా రోజులుగా అభిరామ్ సినిమాల్లోకి వస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. కానీ ఈసారి మాత్రం అతడి ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందని సమాచారం.

శంకర్ నాథ్ దుర్గ అనే దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఓ కొత్త నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.