హృతిక్ రోషన్ ‘కాబిల్’ తెలుగులో!

బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ “కాబిల్”. గతం లో క్రిష్, క్రిష్ 3, కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ కాబిల్ తో ప్రేక్షకుల ముందు కు రాబోతోంది. ఈ చిత్రం లో హ్రితిక్ రోషన్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది.
సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం గా జనవరి 26 2017 న విడుదల అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు లో కూడా భారీ గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. గతం లో హ్రితిక్ నటించిన క్రిష్ చిత్రాలు మరియు ధూమ్ 2 చిత్రం తెలుగు లో విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హ్రితిక్ కి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తో, తెలుగు లో కూడా భారీ విడుదల కు నిర్మాతలు సిద్ధ పడుతున్నారు.
ఈ చిత్రం మొదటి టీజర్ దీపావళి కానుకగా నవంబర్ 26 న విడుదల అవుతుంది. కాబిల్ చిత్రానికి రాజేష్ రోషన్ సంగీతాన్ని అందించారు.
 
CLICK HERE!! For the aha Latest Updates