HomeTelugu Trendingకామ్రేడ్స్‌కు టికెట్లు దొరకటం లేదు

కామ్రేడ్స్‌కు టికెట్లు దొరకటం లేదు

1 24క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం రేపు విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఇక అమెరికాలో ఈరోజు రాత్రి నుండే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ షోలకు డిమాండ్ హెవీగా ఉండటంతో వారం ముందు ఓపెన్ చేసిన టికెట్లు అన్నీ అమ్ముడైపోయాయి. చాలామందికి టికెట్లు దొరకని పరిస్థితి.

దీంతో సినిమా డిస్ట్రిబ్యూటర్లు ప్రీమియర్ల కంటే ముందే కొన్ని చోట్ల ఎర్లీ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఖాయమని అర్థమవుతోంది. ఇకపోతే భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రీ మూవీస్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu