HomeTelugu TrendingSakshi TV కి పెద్ద షాక్ ఇచ్చిన BARC రేటింగ్స్!

Sakshi TV కి పెద్ద షాక్ ఇచ్చిన BARC రేటింగ్స్!

Huge shock to Sakshi TV with BARC ratings!
Huge shock to Sakshi TV with BARC ratings!

Sakshi TV in BARC Ratings:

ఈ వారం BARC విడుదల చేసిన టీవీ న్యూస్ ఛానల్స్ రేటింగ్స్ టాలీవుడ్ సినిమాల మాదిరిగానే ట్విస్టులతో నిండి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ 15 ఏళ్ల పైబడిన ప్రేక్షకుల కేటగిరీలో టీవీ9, ఎన్టీవీ టాప్‌లోనే నిలిచాయి.

కానీ గత కొన్ని వారాల్లో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ మౌత్‌పీస్‌గా ఉన్న సాక్షి టీవీ, టీడీపీకి అనుకూలంగా ప్రసారం చేసే TV5, ABN ఛానల్స్‌పై ఆధిక్యం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే ఇప్పుడు మరొక ట్విస్ట్. ఈ వారం TV5 మూడో స్థానానికి ఎగబాకగా, ABN నాలుగో స్థానంలోకి వచ్చింది. అంటే ఈ రెండు ఛానల్స్ మళ్ళీ పుంజుకున్నాయి. గత వారం ABN #3, TV5 #4గా ఉండగా, ఇప్పుడు మాత్రం వాటి స్థానాలు మారాయి.

ఇక సాక్షి టీవీ రేటింగ్ మాత్రం తగ్గుతూ వస్తోంది. గత వారం 19.2 ఉండగా, ఈ వారం 18.4కి పడిపోయింది. దీనితో సాక్షి టీవీ మళ్ళీ తన సాధారణ స్థానం అయిన ఆరో స్థానానికి చేరుకుంది.

హైదరాబాద్‌లో కూడా ర్యాంకులు బాగా చేంజ్ అయ్యాయి. టాప్ 6 ఛానల్స్ – టీవీ9, ABN, V6 న్యూస్, TV5 న్యూస్, సాక్షి టీవీ, ఎన్టీవీగా ఉండగా, ఎన్టీవీ ఆంధ్ర, తెలంగాణలో రెండో స్థానంలో ఉన్నా హైదరాబాద్‌లో మాత్రం ఆరో స్థానంలో ఉండడం గమనార్హం.

ఈ మార్పులు చూస్తుంటే రాజకీయ టర్నింగ్స్, ప్రజాభిప్రాయ మార్పులు, కంటెంట్ క్వాలిటీ అన్నీ టీవీ ఛానల్స్ ర్యాంకింగ్స్‌కి బాగా ప్రభావితం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది!

Recent Articles English

Gallery

Recent Articles Telugu