నానిని వేధించిన వార్త!

పెళ్ళయిన హీరోలని గాసిప్పుల్లోకి లాగితే ఎలా ఉంటుందో ఇది ఓ మంచి ఉదాహరణ. కుటుంబ అమెతంగా ఈ గాసిప్స్ పై అరలు మొదలయ్యాయో ఏమో….పాపం నాని ఎంతో మదన పడ్డాడట. తనపై వచ్చిన ఆ గాసిప్ తనను ఎంతో బాధించిందని అన్నాడు. అలా రాయడం తగదని వేడుకున్నాడు.

అసలు ఇంతకీ ఏమిటి ఆ గాసిప్? ఎవరితో అఫైర్ అనేది తెలియాలంటే….పెళ్ళయిన హీరో నానికి యంగ్ టాలెంటెడ్ గర్ల్ సాయి పల్లవితో అఫైర్ నడుస్తుందని ఇటీవల కొన్ని వెబ్ సైట్స్ లో ప్రచారం అయింది. ఈ ప్రచారం తనని ఎంతో ఇబ్బందికి గురి చేసిందని నాని ఎం.సి.ఏ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆవేదన చెందారు. ‘అంత ప్రాముఖ్యత లేని వెబ్ సైట్ వారు రాశారు. ఆ లింక్ ని నా ఫ్రెండ్ ఒకరు పంపితే చదివాను. చదవగానే చాలా బాధపడ్డా. ఎంత దిగాజారిపోయారో అనిపించింది’ అని వ్యాఖ్యానించాడు నాని.