నేను రూమర్స్‌ పట్టించుకోను: అనిల్‌ రావిపూడి

‘సుప్రీం, పటాస్, రాజా ది గ్రేట్’ వంటి హిట్‌ సినిమాలతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి. ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళని ఈ దర్శకుడిపై కొన్నాళ్లుగా ఒక హీరోయిన్‌తో సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. త్వరలో విడుదలకానున్న ‘ఎఫ్ 2’ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న అనిల్ రావిపూడి ఆ రూమర్లపై స్పందిస్తూ నాకు హీరోయిన్‌తోనూ సంబంధం లేదు. నేను ఎలాంటి వాడినో నా వాళ్లకు తెలుసు. పరిశ్రమలో ఇలాంటి రూమర్స్ కామన్. వాటిని పట్టించుకుంటూ పోతే పనిచేయలేం. అందుకే వాటిని అస్సలు పట్టించుకోను అంటూ నేరుగా సమాధనమిచ్చాడు.