సిగరెట్‌, పొగాకు వాసన అంటే ఇష్టం: శృతిహాసన్‌

కమల్‌హాసన్‌ వారసురాలిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ శృతిహాసన్‌. ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె నటిగానే కాకుండా పలు సినిమాల్లో గాయనిగా కూడా మెప్పించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్న శ్రుతిహాసన్‌ ప్రతిరోజూ పలు ఆసక్తికర విశేషాలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

‘నాకు గులాబి, చాక్లెట్‌, పెన్సిల్‌, సిగరెట్‌, పొగాకు వాసన అంటే ఇష్టం. అయితే వాటిని కాల్చినప్పుడు వచ్చే వాసన అంటే ఇష్టం ఉండదు. వెనిలా ఫ్లేవర్‌ వాసన కూడా ఇష్టం. చిన్నప్పుడు ఎరైజర్‌ సువాసనని కూడా ఎక్కువగా ఇష్టపడే దానిని.’ అని తెలిపింది. అనంతరం ఆమె తన ఫోన్‌లో ఎక్కువగా ఉపయోగించే యాప్‌ గురించి తెలియజేస్తూ.. ‘ఈమెయిల్‌, మెస్సేజ్‌లు, కాల్‌ కాకుండా నేను ఎక్కువగా ఉపయోగించే యాప్‌ వచ్చేసి కాల్‌ రికార్డ్‌’ అని శృతి హాసన్‌ చెప్పింది.

‘కాటమరాయుడు’ సినిమా తర్వాత కొన్ని సంవత్సరాలపాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న శృతిహాసన్‌ ప్రస్తుతం ‘క్రాక్‌’ చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు.