ధనుష్ కి మంచి భార్యనవ్వాలనుంది!

తన ప్రేమ, పెళ్లితో అమ్మడు అప్పట్లో వార్తల్లో బాగా నిలిచింది అమలాపాల్. ఎంత తొందరగా పెళ్లి చేసుకుందో.. అంతే తొందరగా విడాకులు కూడా తీసుకొని కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు హీరో ధనుష్ మీద కామెంట్స్ చేసి మరోసారి ఇప్పుడు వార్తల్లోకెక్కింది. అమలాపాల్ కు ధనుష్ నటిస్తోన్న ‘విఐపి2’ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అమలాపాల్.. ధనుష్ ఛాన్స్ ఇస్తే అతడికి మంచి భార్యనవుతా.. అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. అయితే అంతలోనే రియల్ లైఫ్ లో కాదూ.. రీల్ లైఫ్ లో.. అంటూ చమత్కరించింది.

గతంలో విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న విఐపి సినిమా తెలుగులో ‘రఘువరన్ బిటెక్’ పేరుతో అనువదించారు. ఇక్కడ కూడా సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీనికి కొనసాగింపుగా ‘విఐపి2’ సినిమా రానుంది. మొదటి భాగంలో ధనుష్, అమలాపాల్ ల కాంబినేషన్ కు మంచి మార్కులు పడడంతో సీక్వెల్ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా కంటిన్యూ చేశారు. అయితే ‘విఐపి3’ సినిమా గనుక నిర్మిస్తే అందులో ధనుష్ కి మంచి భార్యగా ఉంటా అంటూ వెల్లడించింది అమలాపాల్.