HomeTelugu Newsతమిళ సినిమాపై మొగ్గు చూపుతున్న ఇల్లీ బేబీ!

తమిళ సినిమాపై మొగ్గు చూపుతున్న ఇల్లీ బేబీ!

Ileana interested in kollywood

టాలీవుడ్‌లో ‘దేవదాస్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత వరుస ఆఫర్‌లతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ జోష్ లోనే మెల్లగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడుకి అక్కడ ఆశించిన హిట్స్‌ రాలేదు. మరోవైపు విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ లో ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రియుడికి బ్రేకప్ చెప్పేసిన ఇలియానా.. టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ దక్కించుకుందని వార్తలు వచ్చాయి. ‘కింగ్’ నాగార్జున సరసన నటించే ఛాన్స్ ఇలియానా కొట్టేసిందని న్యూస్ వచ్చినప్పటికీ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఇదిలా ఉండగా గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు తెలుగు కంటే తమిళ్ ఇండస్ట్రీకే ప్రాధాన్యత ఇస్తోందని కాస్టింగ్ వర్గాలు చెప్తున్నాయి. తెలుగు సినిమాల గురించి పక్కన పెట్టండి.. తమిళ్ లో ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ వెతకండి అని వారికి బంపర్ ఆఫర్ ఇస్తుందట ఇలియానా. మొత్తం మీద ఈ బ్యూటీ మరోసారి సౌత్ ఇండస్ట్రీని ఏంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందన్నమాట

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!