
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా 1940ల రాజకీయ, యుద్ధ నేపథ్యంతో ఉన్న గొప్ప ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ప్రాజెక్టు గురించి చాలా రోజులుగా వార్తల్లో చర్చలు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. ఇంతవరకు చిత్ర యూనిట్ అధికారికంగా హీరోయిన్ పేరు ప్రకటించలేదు. ఆలియా భట్ లేదా మృణాల్ ఠాకూర్ ఈ ప్రాజెక్టుకు ఎంపికయ్యారని అందరూ భావించారు. కానీ ముహూర్తం పూజ సందర్భంగా Imanvi అనే కొత్త నటి పేరు అధికారికంగా బయటకు వచ్చేసింది.
ఇంతవరకు ఈమె గురించి ఎటువంటి సమాచారం ప్రేక్షకులకు తెలియదు. కేవలం ముహూర్తం పూజ సమయంలో Imanvi పేరును మాత్రమే ప్రకటించారు. ఇమాన్వి ఇస్మాయిల్ డ్యాన్స్ వీడియోలతో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో పేరు తెచ్చుకుంది. ఆమె కూచిపూడి, భరతనాట్యం కూడా చేస్తూ డ్యాన్స్ రీల్స్‌లో ఫేమస్ అయ్యింది.
కానీ ఒకేసారి ఈ ప్రభాస్ పక్కన నటించిన అవకాశం రావడంతో.. ఆమె పేరు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మారు మ్రోగిపోతుంది. కేవలం ప్రభాస్ సినిమాలో హీరోయిన్ అవగానే ఒక్క రాత్రిలో ఆమె ఫాలోవర్లు కూడా భారీగా పెరిగిపోయారు. నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు డార్లింగ్ హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.













