‘సైరా’ ట్రయలర్ డేట్‌ ఫిక్స్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. జాతీయ స్థాయి నటీనటులతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే విడుదల అయిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్రం ట్రయలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న ట్రైలర్‌ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్, తమన్నా, సుధీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.