HomeTelugu Newsఆదాయపు పన్ను చెల్లించే వారికి కేంద్రం మరో వరం!

ఆదాయపు పన్ను చెల్లించే వారికి కేంద్రం మరో వరం!

6 12

వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే ఓటాన్ అకౌంట్ సందర్భంగా దీనిపై ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు ఆదాయంపై వ్యక్తిగత ఆదాయపు పన్ను లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల లోపు ఆదాయంపై 5 శాతం పన్ను, రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయం ఉంటే 20%, రూ.10 లక్షలపైబడిన ఆదాయంపై 30% పన్ను విధిస్తున్నారు. పరోక్ష పన్నుల విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇటీవలే ఇండస్ట్రీ ఛాంబర్ సీఐఐ కూడా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసి రూ.5 లక్షలు చేయాలని కోరింది. అలాగే పొదుపులను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో సెక్షన్ 80సి కింద తగ్గింపు పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచాలని కోరింది. ఆర్థిక మంత్రిత్వశాఖకు బడ్జెట్ ముందు ఇచ్చే సలహాల్లో భాగంగా సీఐఐ, అత్యధిక వ్యక్తిగత ఆదాయ పరిమితిని 30% నుంచి 25% చేయాలని సూచించింది. వైద్య ఖర్చులు, రవాణా భత్యాలపై మినహాయింపు ఇవ్వాలని చెప్పింది. రూ.5-10 లక్షల ఆదాయంపై 10%, రూ.10-20 లక్షల ఆదాయంపై 20%, రూ.20 లక్షల పైబడిన ఆదాయంపై 25% పన్ను విధించాలని సిఫార్సు చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu