భారత్‌లో విజృంభిస్తున్న కరోనా మొత్తం 1,783 మరణాలు


భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,952 వేలకు చేరింది. గత 3 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 3,561 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 89 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 52,952కి చేరింది. ఇప్పటి వరకు 1,783 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం దేశవ్యాప్తంగా 15,267మంది కరోనా నుంచి కోలుకున్నారు. 35,902 మంది చికిత్సపొందుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,758కి చేరింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1,233 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 651 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 16,758కి చేరింది.

తెలంగాణలో కరోనా @ 1107
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య బుధవారం నాటికి 1107కి చేరింది. ఇవాళ కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 11 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇవాళ కరోనా నుంచి కోలుకుని 20 మంది డిశ్చార్జి కాగా ఇప్పటి వరకు 648 మంది డిశ్చార్జి అయినట్లు రాష్ట్ర ఆరోగ్య వైద్యశాఖ వెల్లడించింది. మరో 430 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో కరోనా @ 1,833
ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,833కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో ఏపీలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాల వారీగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 533 మంది కరోనా బాధితులు ఉండగా, గుంటూరు 373, కృష్ణా 316, నెల్లూరు 96, కడప 96, చిత్తూరు 82, అనంతపురం 83, ప్రకాశం 61, ప.గో 59, తూ.గో 46, విశాఖ 46, శ్రీకాకుళం జిల్లాలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 780 మంది డిశ్చార్జి కాగా, 1015 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా రహిత జిల్లాగా ఉన్న విజయనగరంలో తాజాగా ఇవాళ 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.