పాతబస్తీలో బన్నీ సందడి!

అల్లు అర్జున్, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ‘దువ్వాడ జగన్నాథ్’ సినిమా రూపొందుతోంది. వరుస హిట్స్ తో తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ. ఇందులో భాగంగానే హరీష్ చెప్పిన కథకి ఓకే చెప్పాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పాతబస్తీలో జరుగుతోంది.

ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ ఓ బ్రాహ్మణ కుర్రాడి పాత్రలో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ గెటప్ వేసుకున్న బన్నీ ఛార్మినార్ చుట్టుప్రక్కల ప్రాంతంలో తిరిగే కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బిజీగా ఉండే ఛార్మినార్ రోడ్లపై బన్నీ చాలా హడావిడి చేస్తున్నాడట.

ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవలే ఆమె కూడా షూటింగ్ లో జాయిన్ అయిందని సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను బన్నీ ఏ మేరకు రీచ్ అవుతాడో.. చూడాలి!