HomeTelugu Newsవరల్డ్‌కప్ సెమీస్‌లో వెనుదిరిగిన భారత్

వరల్డ్‌కప్ సెమీస్‌లో వెనుదిరిగిన భారత్

14a
వరల్డ్‌కప్‌లో భారత్‌ పోరు ముగిసింది. సెమీస్‌లోనే పరాజయం పాలై ఇంటిముఖం పట్టింది. ఇవాళ జరిగిన సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 240 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్‌ శర్మ(1), రాహుల్‌(1), కోహ్లీ(1) ముగ్గురూ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్, కార్తీక్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వికెట్ పడుకుండా కాసేపు నిలువరించారు. కానీ.. కొద్ది సేపటికే కార్తీక్‌(6)ను హెన్రీ అవుట్ చేశాడు. ఆ తర్వాత పంత్ (32), హార్ధిక్‌ పాండ్యా(32)లు కాసేపు భారత శిబిరంలో ఆశలు రేపారు.

పాండ్యా అవుటయ్యాక ఓటమి ఖాయమనుకున్న తరుణంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (77: 59 బంతుల్లో.. 4 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో ధోనీ (50: 72 బంతుల్లో.. 1 ఫోర్, 2 సిక్సర్‌) చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ జట్టును విజయం వరకూ తీసుకొచ్చారు. విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు అవసరమైన తరుణంలో భారీ షాట్‌కు యత్నించి జడేజా అవుటయ్యాడు. ఆ తర్వాత గప్టిల్‌ అద్భుత త్రోకు ధోనీ రనౌట్‌ అయ్యాడు. చివర్లో భువనేశ్వర్‌, చాహల్‌ల వికెట్లు కూల్చి భారత్‌ను ఆలౌట్‌ చేసింది న్యూజిలాండ్‌. కివీస్‌ బౌలర్లలో హెన్రీ 3, శాంట్నర్‌, బౌల్ట్‌ చెరో 2, ఫెర్గూసన్‌, నీషమ్‌ చెరో వికెట్‌ తీశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu