చప్పట్లు తో మ్రోగిన దేశం


ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు ఈ రోజు ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటలకు జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. కరోనా వైరస్ విషయం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు దేశంలోని ప్రతి ఒక్కరు వారు ఉన్న ప్రాంతం నుంచి బయటకు వచ్చి ఐదు నిమిషాలపాటు చప్పట్లు కొట్టాలని, తద్వారా భారతదేశంలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది నిరాటంగా సేవలందిస్తున్నారు వారికి కృతజ్ఞతలు తెలిపినట్టు అవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా ఈ సాయంత్రం 5 గంటలకు దేశ వ్యాప్తంగా ప్రజలంతా తమ ఇళ్లలోంచి బయటకు వచ్చి సంఘీభావం తెలిపారు. తెలంగాణ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గంట కొట్టి మద్దతు ప్రకటించారు. ప్రజలు సైతం ఇళ్ల ముందు నిలుచుని వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలిపారు.