కొత్త కథల కోసం రాజమౌళి!

బాహుబలి2 సక్సెస్ తో జక్కన్న బాగా ఖుషీగా ఉన్నాడు. ఎన్నో ఏళ్లుగా ఈ ఒక్క సినిమా కోసం కష్టపడిన ఆయన సక్సెస్ ను ఎంజాయ్ చేయడానికి కుటుంబసమేతంగా విదేశాలకు వెళ్లనున్నాడు. అయితే ఈలోగా తన తదుపరి సినిమాకు సంబందించి కథను సెట్ చేసుకొని వెళ్లాలని ఆయన భావిస్తున్నాడు. ఈ నేపధ్యంలో విజయేంద్రప్రసాద్ తో కలిసి రచయితల బృందంతో రాజమౌళి చర్చలు జరుపుతున్నాడు.

ఇప్పటికే విజయేంద్రప్రసాద్ వినిపించిన కొన్ని కథలు కూడా రాజమౌళి విన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో ఒక కథను ఫైనల్ చేసి కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చి ట్రిప్ కు వెళ్దామని రాజమౌళి ఆలోచిస్తున్నాడు. తన వెకేషన్ పూర్తి చేసుకొని వచ్చిన తరువాత సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో రాజమౌళి తదుపరి సినిమా ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి హీరోలతో ఉంటుందని అంటున్నారు.