‘ఇంకొక్క‌డు’ విజ‌య‌యాత్ర‌!

శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటించిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ ఇంకొక్క‌డు. ఆనంద‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్ బ్యాన‌ర్‌పై నీలం కృష్ణారెడ్డి విడుద‌ల చేశారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అయిన నేప‌థ్యంలో చిత్ర‌యూనిట్ రేపు వైజాగ్‌లో విజ‌య‌యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ..
ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్ అధినేత నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ”విల‌క్ష‌ణ న‌ట‌న‌కు పెట్టింది పేరైన నటుడు చియాన్ విక్ర‌మ్ మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. అఖిల‌న్‌, ల‌వ్ అనే పాత్ర‌ల్లో ఆయ‌న అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. విక్ర‌మ్ త‌ప్ప మ‌రెవ‌రూ చేయ‌లేర‌నే రేంజ్‌లో ల‌వ్ పాత్ర‌ను ఆయ‌న తెర‌పై ఎక్స‌లెంట్‌గా పండించారు. ఆనంద్ శంక‌ర్ టేకింగ్‌, న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్‌ల న‌ట‌న, హై టెక్నిక‌ల్ వాల్యూస్ సినిమాకు పెద్ద హైలైట్‌గా నిలిచాయి. సెప్టెంబ‌ర్ 8న విడుద‌లైన మా ఇంకొక్క‌డు చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు పెద్ద స‌క్సెస్ చేసినందుకు వారికి థాంక్స్‌. ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చెప్ప‌డానికి విక్ర‌మ్ స‌హా యూనిట్ స‌భ్యులంద‌రూ వైజాగ్‌లోవి మ్యాక్స్‌కు వస్తున్నారు. అలాగే సాయంత్రం హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో థాంక్స్‌మీట్‌ను ఏర్పాటు చేశాం” అన్నారు.
CLICK HERE!! For the aha Latest Updates