HomeTelugu Trendingమహేశ్‌ బాబు 'సర్కారి వారి పాట'..

మహేశ్‌ బాబు ‘సర్కారి వారి పాట’..

7 25

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ తర్వాత తన తదుపరి చిత్రాన్ని పరశురాం డైరెక్షన్‌లో చేయడానికి సిద్థం అయ్యాడు. అయితే, లాక్ డౌన్ తో షూటింగులకు బ్రేక్‌ పడటంతో.. ఈ సినిమా కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగును ఈ నెల 31న లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు ముహూర్తాన్ని నిర్ణయించారు.

ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి టైటిల్ని కూడా నిర్ణయించారట. ‘సర్కారి వారి పాట’ అనే కొత్త తరహా టైటిల్ని ఫైనల్ చేశారని అంటున్నారు. చిత్రం ప్రారంభం రోజున దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు అనేది చర్చనీయా అంశంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu