HomeTelugu News'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' గ్రాండ్ రిలీజ్‌!

‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ గ్రాండ్ రిలీజ్‌!

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’. ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది. సినిమాను న‌వంబ‌ర్ 11న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ.. ”అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో చిత్రాల తర్వాత మా బేనర్‌లో వస్తోన్న ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ టచ్‌తో అందర్నీ అలరించే చిత్రంగా ఇది రూపొందుతుంది. ఇటీవ‌ల రెండు పాటలను బ్యాంకాక్‌లో చిత్రీక‌రించ‌డంతో షూటింగ్‌ పూర్తయింది. న‌వంబ‌ర్ 11న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది” అన్నారు.
దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ”అల్లరి నరేష్‌తో చేసిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ చిత్రం మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ మిక్స్‌ అయిన ఫ్యామిలీ డ్రామా ఇది. భారీ చిత్రాలు నిర్మించే ఛత్రపతి ప్రసాద్‌గారి బేనర్‌లో ఓ మంచి సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది. న‌వంబ‌ర్ 11న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. షూటింగ్ పూర్తైంది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu