HomeTelugu Big Storiesరివ్యూ: వివేకం

రివ్యూ: వివేకం

నటీనటులు: అజిత్ కుమార్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ తదితరులు 
సంగీతం: అనిరుధ్ 
సినిమాటోగ్రఫీ: వెట్రీ
ఎడిటింగ్: రుబెన్ 
నిర్మాతలు: సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్, టి.జి.త్యాగరాజన్ 
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శివ 
అజిత్ కుమార్ హీరోగా గతంలో ‘వీరం’,’వేదాళం’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శివ మరోసారి అజిత్ తో కలిసి ‘వివేకం’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్ట్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వివేకంతో శివ హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడో.. లేదో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
 
కథ: 
అజయ్ కుమార్(అజిత్ కుమార్) కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో ఆఫీసర్ గా పని చేస్తుంటాడు. తనతో పాటు ఆర్యన్(వివేక్ ఒబెరాయ్), షాన్(ఆర్ణవ్), రాచెల్(అమిలియా), మైక్(సెర్జ్ క్రోజాన్) కూడా పని చేస్తుంటారు. ఈ ఐదుగురు కూడా ఒక టీంగా ఉంటారు. కొందరు అరాచకులు అతి శక్తివంతమైన వెపన్స్ ను భూమిలో పాతిపెట్టి వారి ద్వారా భూకంపాలను సృష్టించి 

ప్రజలను చంపి క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. వాటిని అరికట్టే బాధ్యత అజయ్ తీసుకుంటాడు. నటాష(అక్షర హాసన్) అనే యువతి దగ్గర ఈ వెపన్స్ ను డీయాక్టివేట్ చేసే కోడ్ ఉందని తెలుసుకున్న అజయ్ ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. 

 అయితే ఆమె వద్ద నుండి కోడ్ ను సంపాదించిన ఏకె కనిపించకుండా పోతాడు. అతడు చనిపోయి ఉంటాడని ఇంటెలిజెన్స్ రికార్డులు చెబుతాయి. కానీ వాస్తవానికి ఏకె బ్రతికే ఉంటాడు. అసలు ఏకె కనిపించకుండా పోవడానికి గల కారణాలు ఏంటి..? ప్రజలను న్యూక్లియర్ బాంబ్ నుండి రక్షించగలిగాడా..? ఆర్యన్ తో పాటు మిగిలిన స్నేహితులు తనకు చేసిన ద్రోహంపై అజయ్ ఎలా పగ తీర్చుకున్నాడు..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

 
విశ్లేషణ:
సహజ భూకంపాలను సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి దాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న కొందరికి ఓ నిజాయితీగల ఆఫీసర్ ఎదురు తిరిగితే ఎలా ఉంటుందనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా మొదటి భాగం మొత్తం నటాష అనే యువతిని వెతకడం చుట్టూనే కథ నడుస్తుంది. మంచి ఎమోషన్ తో ఇంటర్వల్ బ్యాంగ్ ఇచ్చాడు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం అనుకున్న రీతిలో ఉండదు. పతాక సన్నివేశాలను సాగదీశారనే భావన కలుగుతుంది. 
సినిమాలో అజిత్ ను స్టైలిష్ గా చూపించడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు దర్శకుడు. అజిత్ తన పాత్రలో అధ్బుతంగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో జీవించేశాడు. కాజల్ అగర్వాల్, అజిత్ భార్య పాత్రలో బాగానే నటించింది. తెరపై అందంగా కనిపించింది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం ఆమె పాత్ర కాస్త అతి అనిపిస్తుంది. వివేక్ ఒబెరాయ్ స్టైలిష్ విలన్ గా బాగా నటించాడు. అజిత్ కు ప్రతినాయకుడి పాత్రలో బాగా సూట్ అయ్యాడు. అక్షర హాసన్ పాత్ర చిన్నదే అయినా.. తన నటనతో ఓకే అనిపించింది. కరుణాకరన్ తెరపై కనిపించినంతసేపు కూడా తన కామెడీతో నవ్వించాడు.
సాంకేతికంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమా మొత్తం కూడా విదేశాల్లోనే చిత్రీకరించారు. సినిమాలో లొకేషన్స్ చాలా అందంగా కనిపిస్తాయి. కెమెరా పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. అనిరుధ్ సంగీతం మాత్రం చాలా లౌడ్ గా ఉంది. పాటలు కూడా ఆకట్టుకునే విధంగా లేవు. ఎడిటింగ్ వర్క్ బాగుంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu