
Tollywood Stars in Summer Break:
వేసవి వచ్చిందంటే మన స్టార్ హీరోలు ఎండల నుంచి దూరంగా వెళ్లిపోవడం ఆనవాయితీ. మహేష్ బాబు అయితే ప్రతి సంవత్సరం ఈ టైంలో విదేశాలకి వెళ్ళిపోతుంటారు. ఈ సారి రాజమౌళి సినిమా మొదలయ్యేలా ఉందని అందరూ అనుకున్నారు, కానీ ఎండల తీవ్రత వల్ల షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. దాంతో మహేష్ మళ్లీ ఓ చిన్న వెకేషన్ ప్లాన్ చేసేశాడు.
రామ్ చరణ్ కూడా షూటింగ్ బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడట. ఎక్కువగా ఔట్‌డోర్ లో ఉండే సీన్ల వల్లే తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇక అల్లు అర్జున్ అయితే అప్పుడే షూటింగ్ మొదలు పెట్టలేదు. అట్లీతో చేయబోయే మూవీకి స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. వేసవి ముగిసిన తర్వాతే సెట్స్ మీదకి రావాలని డిసైడ్ అయ్యాడు.
ప్రభాస్ స్టైల్ అయితే వేరే లెవెల్. ఎండలు పడుతుంటే షూటింగ్ ఏంటి అని, డైరెక్ట్ ఇటలీకి ఎగిరిపోయాడు. అక్కడ చల్లగా ఉంటే అక్కడి నుంచే రిలాక్స్ అవుతూ సమ్మర్ గడుపుతున్నాడు.
అందరూ బ్రేక్ లో ఉన్న ఈ టైంలో ఒక్క ఎన్టీఆర్ మాత్రం మామూలు కాకుండా పని మీద ఉన్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ హాట్ హాట్ వెదర్ లోనూ కొనసాగుతూనే ఉంది. ఆల్రెడీ ఆలస్యం అయ్యినందున ఏ మాత్రం టైమ్ వదలకుండా ఎన్టీఆర్ షూట్ లో బిజీగా ఉన్నాడు.
స్టార్ హీరోలందరూ వేసవిలో రిఫ్రెష్ అవుతూ, సెప్టెంబర్ తర్వాత మళ్లీ ఒక్కసారిగా భారీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ALSO READ: Ajaz Khan పై రేప్ కేస్.. సినిమాలో అవకాశం అంటూ మోసం..













