
Rape Case on Ajaz Khan:
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ మరోసారి వివాదంలో ఇరుకున్నాడు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఆయనపై ఛార్కోప్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. 30 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదులో వివరాల ప్రకారం – “సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ ఇప్పిస్తాను” అనే నమ్మకంతో అజాజ్ ఖాన్ ఆమెను మోసం చేసి, పలు చోట్ల శారీరకంగా దాడి చేశాడు.
అతను తాను చెప్పినట్టుగా అవకాశం ఇప్పించకపోగా, మోసం చేశాడంటూ బాధిత మహిళ ఆరోపించారు. దీంతో పోలీసులు భారత్ న్యాయ సంహితలోని అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది అజాజ్ ఖాన్‌కు కొత్త పరిణామం కాదు. ఇంతకముందు కూడా ‘హౌస్ అరెస్ట్’ అనే వెబ్ షోలో అతని పాత్రపై విమర్శలు వచ్చాయి. ఉల్లు యాప్‌లో స్ట్రీమ్ అయిన ఈ షోలో అజాజ్ ఖాన్ అసభ్యకరమైన ప్రశ్నలు అడుగుతూ, మహిళలపై ఒత్తిడి తెచ్చే సన్నివేశాలు వైరల్ అయ్యాయి.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు అజాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివాదాల్లో ఉన్న అతని మీద మరొకసారి ఇలాంటీ ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీలో షాక్ వేస్తోంది.
ఇందులో నిజమెంతన్నది అధికార విచారణలో తేలాల్సి ఉంది. కానీ ప్రముఖుల పేరుతో ఇలా మహిళలను మోసం చేసే ఘటనలు ఇప్పుడు తరచూ జరిగిపోతున్నాయి. ఇది బాధాకరమైన విషయమే.
ALSO READ: ప్రపంచవ్యాప్తంగా Top 10 Richest Actors జాబితా లో మన హీరోలు ఎవరున్నారంటే!