‘జాను’ మూవీ రివ్యూ..

movie-poster
Release Date
February 7, 2020

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌, స్టార్‌ హీరోయిన్‌ సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘జాను’. కోలీవుడ్‌ సంచలనం సృష్టించిన క్లాసిక్‌ సినిమా ‘96’. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటంతో కన్నడలో ‘99’ గా రీమేక్ అయింది. గణేష్‌, భావన జంటగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాను రీమేక్‌ చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా మాతృకకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమారే ఈ సినిమాను కూడా తెరెకెక్కించారు. ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ : మన హీరో (శర్వానంద్‌) సి.రామచంద్రన్‌ అలియాస్‌ రామ్‌ ఈ చిత్రంలో ట్రావెల్‌ ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తాడు. ఓ జర్నీలో తను పుట్టి పెరిగిన ఊరికి వెళతాడు. అక్కడ ఒక్కొక్కటిగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటాడు. అలా తను చదువుకున్న స్కూల్‌ దగ్గరకు చేరుకుంటాడు రామ్‌. ఆ సమయంలోనే తొలిప్రేమ జ్ఞాపకాలు అతడి కళ్లముందు కదులుతాయి. హీరోయిన్‌(సమంత)జానకీ దేవీ అలియాస్‌ ‘జాను’ తో ప్రేమలో పడటం.. ఆమెతో గడిపిన మధుర క్షణాలు.. విడిపోవటం! అన్నీ గుర్తుకు వస్తాయి. ఆ తర్వాత చోటుచేసుకునే కొన్ని పరిణామాలతో దాదాపు 17 సంవత్సరాల తర్వాత స్కూల్‌ ఫ్రెండ్స్‌ ఏర్పాటు చేసిన గెట్‌ టు గెదర్‌ పార్టీలో ఇద్దరూ కలుస్తారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎందుకు విడిపోయారు? సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న ఆ ప్రేమ జంట మదిలో మెదిలే భావాలేంటి? అన్నదే కథలోని అంశం.

నటీనటులు : ఎప్పటిలాగనే సమంత తన హావభావలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. భగ్న ప్రేమికుడిగా శర్వానంద్‌ నటన అద్భుతంగా ఉంది. తెరపై కనిపించింది కొద్దిసేపే అయినా వెన్నెల కిషోర్‌, రఘుబాబు, తాగుబోతు రమేష్‌, శరణ్యల నటన బాగుంటుంది. శర్వానంద్‌, సమంతల చిన్నప్పటి పాత్రలుగా కనిపించిన సాయికుమార్‌, గౌరీ కిషన్‌ల నటనకూడా మనల్ని ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ : డైరెక్టర్‌ సి. ప్రేమ్‌ కుమార్‌ ‘జాను’ మూవీని ఓ రీమేక్‌లా కాకుండా తెలుగు నేటివిటీతో తెరకెక్కించాడు‌. ’96’ సినిమా మ్యాజిక్‌ టాలీవుడ్‌లో కూడా కొనసాగిందని చెప్పొచ్చు. ప్రేమ కథలకు ఆధారమైన ఎమోషన్స్‌ ఎక్కడా తగ్గలేదు. తొలిప్రేమతో ముడిపడి ఉన్న ప్రతీ ఒక్కరి జీవితానికి ఈ సినిమా కచ్చితంగా కనెక్ట్‌ అవుతుంది. కొన్నిసార్లు మనల్ని మనం తెరపైన చూసుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇద్దరి మధ్యా చోటుచేసుకునే కొన్ని సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉంటాయి. కాకుంటే సినిమా స్లోగా ఉండటం ఒక మైనస్ అని చెప్పొచు. 96కు సంగీతం అందించిన గోవింద వసంత ఈ సినిమాకు కూడా పనిచేశారు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది. మొదటి భాగంలోని కొన్ని కామెడీ సీన్లతో నవ్వులు పూయిస్తే.. సెకండ్‌ హాఫ్‌ భగ్న ప్రేమికుల మధ్య బాధతో మన గుండెని పిండేస్తుంది. అశ్లీలతకు తావులేని ఓ చక్కటి ప్రేమకథా ‘జాను’ సినిమా అని ఒక్కమాటలో చెప్పొచ్చు.

హైలైట్స్‌ :సమంత, శర్వానంద్‌ నటన

డ్రాబ్యాక్స్ : స్లో నేరేషన్

టైటిల్ : జాను
నటీనటులు: శర్వానంద్‌, సమంత, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, తాగుబోతు రమేష్‌, శరణ్య
దర్శకత్వం : సి.ప్రేమ్‌ కుమార్‌
నిర్మాత : దిల్‌ రాజు, శిరీష్‌
సంగీతం : గోవింద వసంత

చివరిగా : ఓ చక్కటి ప్రేమకథా ‘జాను’
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Critics METER

Average Critics Rating: 3
Total Critics:2

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

ఓ చక్కటి ప్రేమకథా చిత్రం ‘జాను’
Rating: 3/5

https://www.klapboardpost.com/

జాను.. ఎమోషనల్ లవ్ జర్నీ
Rating: 2.75/5

https://www.tupaki.com/