HomeTelugu Big Storiesమోహన్‌బాబుపై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

మోహన్‌బాబుపై మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

Talasani on Mohan babu2

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు మోహన్‌ బాబు తనయుడు మంచు విష్ణు శనివారం(అక్టోబర్16) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. ‘మా’ అభివృద్ధి కోసం మంచు విష్ణు చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Mohan babu3

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించేలా జరిగాయని అన్నారు. మంచు విష్ణుని ఎన్నుకున్న మా సబ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం నిజంగా ఆనందంగా ఉందని తెలిపారు. మా అంటే చిన్నదేమీ కాదు, పెద్దవ్యవస్థ అలాంటి
వ్యవస్థను తన భుజాలపై వేసుకుని మా సభ్యుల సంక్షేమం కోసం ముందుకొచ్చి ఎన్నికల్లో నిలబడటం గర్వకారణం అన్నారు.

Mohan babu 2

విష్ణుకి క్రమశిక్షణతో పాటు ఎదుటివారితో ఎలా సంస్కారంగా నడుచుకోవాలో మోహన్‌బాబు నేర్పించారని మంత్రి తలసాని అన్నారు. మోహన్‌బాబుకీ నాకు మధ్య 25 ఏళ్ల అనుబంధం ఉందని, మా ఇద్దరిదీ అన్నదమ్ముల అనుబంధం అని మంత్రి తలసాని చెప్పారు. మోహన్‌బాబు తన కోపంతోనే ఆయన చాలా
నష్టపోయాడని ఆ విషయం ఆయన మనసుకి కూడా తెలుసని మంత్రి తలసాని అన్నారు. మోహన్‌బాబు ఎప్పుడూ వ్యక్తిగత లాభం కోసం మాట్లాడలేదని, సమాజ హితం కోసమే ఆయన మాట్లాడతారని మంత్రి కితాబునిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu