HomeTelugu Trending'సాహో'లో శ్రీలంక బ్యూటీ ఐటెం సాంగ్‌ !

‘సాహో’లో శ్రీలంక బ్యూటీ ఐటెం సాంగ్‌ !

3 2యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ సాహో సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తోంది. టాకీ పార్ట్ పూర్తయినా సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు ఇందులో ఐటెం సాంగ్ కూడా ఉన్నట్టు గతంలోనే యూనిట్ ప్రకటించింది. ఈ సాంగ్ లో ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు అనే దానిపై అనేక పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.

పాన్ ఇండియా మూవీ కాబట్టి … ఇందులో ఐటమ్ సాంగ్ ను కూడా రిచ్ గా తీయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఐటెం సాంగ్ కోసం శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను తీసుకున్నారట. ఐటెం సాంగ్ ను యూరప్ లోని క్రొయేషియాలో షూట్ చేస్తున్నారని సమాచారం. కాగా, ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ఈరోజు ప్రకటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu