HomeTelugu News'యూ టర్న్‌' ఫస్ట్‌ లుక్

‘యూ టర్న్‌’ ఫస్ట్‌ లుక్

ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యూ టర్న్‌’. కన్నడ మూవీ యూ టర్న్‌ రీమేక్‌గా అదే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారు. . కన్నడలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన పవన్‌ కుమార్‌ ఈ రీమేక్‌ కూడా దర్వకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్ ను మూవీ యూనిట్‌ ఆదివారం విడుదల చేసింది. సమంత డీ గ్లామరస్‌గా, సీరియస్‌గా కన్పిస్తున్న ఈ లుక్‌ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.

1 24

ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నఈ మూవీలో ఓ కీలకపాత్రలో భూమిక నటించారు. మిగతా పాత్రల్లో ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ కన్పించనున్నారు. సమంత ఈ ఏడాది తెలుగులో మహానటి, రంగస్థలం చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu