Homeపొలిటికల్'జగన్ రెడ్డి' అంటే సంక్షేమం కాదు, సంక్షోభం !

‘జగన్ రెడ్డి’ అంటే సంక్షేమం కాదు, సంక్షోభం !

Jagan Reddy does not mean welfare but crisis

ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన పై ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు ?. ఒక్కటి అయితే స్పష్టం. ఏ మారుమూల గ్రామానికి వెళ్లిన జగన్ రెడ్డి పాలన పోయి చంద్రబాబు పాలన రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అసలు జగన్ రెడ్డికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ?, భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలే ఇప్పుడు జగన్ రెడ్డి పై ఎందుకు విరుచుకుపడుతున్నారు. కారణం ఒక్కటే.. జగనమోహనరెడ్డి ఇచ్చేది సంక్షేమం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి సంక్షోభం అని అర్ధం అయ్యింది. జగన్ రెడ్డి పాలన తీరు మైనార్టీ, ఎస్టీ ఎస్సీ బీసీల ఉజ్వల భవిష్యత్తు ఎదుగుదలకు ప్రతిబంధకం అని పేద వర్గాలకు అర్ధం అయ్యింది. లక్షలాది ఎస్సీ ఎస్టీల ఎదుగుదలకు చేయూతకు కేటాయించిన ఏడువేల కోట్ల రూపాయిలను తన నవరత్నాలకు జగన్ రెడ్డి మళ్లించాడు. ఇది నిజంగా క్షమించరాని ద్రోహం. ఎస్సీ ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే జగన్ రెడ్డి చూస్తున్నాడు తప్ప, వారి బాగు కోసం కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం అవసరమా ?.

జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45 నెలలు గడిచింది. ఇన్ని రోజులూ జగన్ రెడ్డి ప్రజలకు చేసిన మంచి ఏమిటి ?, అసలు ఇన్నేళ్లు జగన్ రెడ్డి ఏం పొడస్తున్నాడు ?, ఎంతసేపూ బటన్ల నొక్కుడు తప్ప మరొకటి లేదు. పోనీ ఆ బటన్ల వల్ల అయినా ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా అంటే అదీ లేదు. రూపాయి ఇచ్చి తిరిగి నాలుగు రూపాయిలు వసూళ్లు చేస్తున్నాడు. ఉప్పు పప్పు బెల్లం నుంచి పెట్రోల్ వరకూ ప్రతిదీ నాలుగింతలు రేట్లు పెరిగాయి. మరోపక్క ప్రాజెక్టుల నిర్మాణ పనులన్నీ ఆపేశాడు ?, అసలు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి కొత్తగా ఒక్క పనైనా మొదలుపెట్టాడా ?, ఆ మాటకొస్తే జగన్ రెడ్డికి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. ఇటువంటి చేతగాని జగన్ రెడ్డిని ఆంధ్ర ప్రజలూ గతంలో ఎన్నడూ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలకు లేనిపోనీ మాటలు చెబుతున్నాడు. నేను మీ బిడ్డ అంటూ కుళ్లిపోయిన మాటలు అల్లుతున్నాడు.

మరోవైపు లోకేష్‌ పాదయాత్ర సునామీలా కొనసాగుతోంది. ఎలాగైనా ఆ పాదయాత్ర ఆగిపోవాలని జగన్ రెడ్డి కనీసం రక్షణ కూడా కల్పించలేదు. అయినా టీడీపీ కార్తకర్తలు వెనక్కి తగ్గలేదు. లోకేష్ పాదయాత్రకు తమకు తామే రక్షణ కల్పించుకుంటున్నారు. అయినా, జగన్ రెడ్డి ప్రభుత్వంలోని అధికారుల్లో మార్పు రాకపోవడం కొసమెరుపు. ఏది ఏమైనా జగన్ రెడ్డి గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు. తన పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయాడు. అరె.. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరైన సమయానికి జీతం కూడా వెయ్యలేని దుస్థితి ఆంధ్ర రాష్ట్రానికి పట్టడం ఆంధ్రరాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. అయినా, జగన్ రెడ్డి ఎప్పుడు జీడీపీ బాగుంది అని చెబుతూ ఉంటాడు కదా.

మరీ జీడీపీ బాగుంటే జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు జగన్ రెడ్డి ?. జగన్ రెడ్డికి ఇప్పుడు ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా అర్ధం అయ్యి ఉంటుంది. తప్పుడు హామీలతో సీఎం అయ్యినంత తేలిగ్గా.. ఆ హామీలను నెరవేర్చలేం అని జగన్ రెడ్డికి చాలా స్పష్టంగా అర్ధం అయ్యి ఉంటుంది. మరోపక్క అవినాష్‌రెడ్డిని సీబీఐ పిలిచినప్పటి నుంచి జగన్‌రెడ్డికి నిద్ర పట్టడం లేదు. సీబీఐ విచారణతో నిజమైన ముద్దాయిలు జైలుకెళ్లే రోజులు దగ్గర పడితే ఆ లిస్ట్ లో జగన్ రెడ్డి కూడా ఉంటాడని టాక్ ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu