
మాజీ బోల్డ్ హీరోయిన్ అనే బిరుదుతో బతుకు బండి లాక్కోవాల్సిన తనను జగన్ రెడ్డి మంత్రిని చేశాడు, జీవితంలో ఎందరో చేతుల్లో ఎన్నో దెబ్బలు తిని తిని బాగా బండ బారి పోయిన తన హృదయానికి జగన్ రెడ్డి సంతోషాన్ని కలిగించాడు. అందుకేనేమో.. జగనన్న ఖాజా.. అదే మన మాజీ హీరోయిన్ రోజా ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్ష నాయకుల పై విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. అయినా ఈ విచ్చలవిడి తనం రోజాకు కొత్తేం కాదు అనుకోండి. కానీ.. తన బారుటి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తొంది.
ఈ సారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ఇద్దరి పై ఒకేసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పై నుంచి వచ్చిన స్క్రిప్ట్ కి తన బూతులను కూడా యాడ్ చేసి కాసేపు బూతు పురాణం వల్లే వేసింది రోజా. పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ఎమోషన్ లు లేవట. రోజా చెప్పింది. మరీ ఈవిడకి జగన్ మీద ఉన్న ఎమోషన్, అందరికీ ఎలా ఉంటుంది ?, ఇక ఒక ఆర్టిస్ట్ గా పవన్ ని చూసి రోజా సిగ్గు పడుతుందట. రోజా నోట సిగ్గు అనే మాట విన్నాక, రెండు తెలుగు రాష్ట్రాల కుర్రాళ్ళు జేబులో చేతులు పెట్టుకుని ఎటు పోవాలో తెలియక, తమలో తామే తెగ కుమిలిపోతున్నారు.
ఇక సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ని ఓడించినా ఆయనకు సిగ్గులేదంటూ రోజా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. మరీ గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన రోజా ఇంకెంత సిగ్గు పడాలి?, చంద్రబాబు తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ నోటికి ప్లాస్టర్ కట్టుకుంటారని, బాబు కష్టాల్లో ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ బయటకు వస్తారని చెబుతుంది. పవన్ నిత్యం జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. కానీ అవేవీ రోజాకి తెలియవా ?, అవున్లే.. మొన్నటి వరకూ జబర్దస్త్ బూతులకు పళ్లు మొత్తం బయట పెట్టేసి ఇకిలించేసిన రోజాకి ఇవేం తెలుస్తాయి ?,
పైగా కందుకూరు ఘటనలో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారని రోజా ప్రశ్నించింది ?, మరీ రోజా ఎక్కడ ఉంది ?, ప్రభుత్వం లో రోజా ఉందా ?, పవన్ ఉన్నాడా ?, ప్రజల సొమ్ము జగన్ చేతుల్లో ఉందా ?, పవన్ చేతుల్లో ఉందా ?, ఇది కూడా తెలియకుండా రోజాకి అసలు మంత్రి ఎలా అయింది ?, అవును, రోజా మంత్రి ఎలా అయ్యింది ?, ఏంమండోయ్ రోజా గారు మీరు మంత్రి ఎలా అయ్యారు. కావల్సిన అన్నీ బూతులు వచ్చు ఆమెకు, పైగా 24 గంటలు బూతులు తిట్టే నోరు ఇచ్చాడు దేవుడు. కాబట్టి.. జగన్ రెడ్డి ఆమెకు మంత్రి పదవి ఇచ్చాడు. సో.. రోజా తన డ్యూటీ తాను చేస్తోంది. ఆమెకు తెలిసింది ఒక్కటే.. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను బూతులు తిట్టడం.
పవన్ కి ప్రజలే రాజకీయ సమాధి కడతారు అంటుంది, చంద్రబాబు నాయుడును శవాల నాయుడు అంటుంది. ఒక వీధి రౌడీ అంటుంది, అలాగే దేశంలోనే పొలిటికల్ సైకో అంటుంది. టీడీపీ, జనసేన సైకో పార్టీలు అంటుంది. అవును, రోజా గారు ఏమైనా అంటారు. మరీ రోజా గారిని ఏమనాలి?, ఏమండీ రోజా గారు మిమ్మల్ని ఏమనాలి ?, జగనన్న ఖాజా అనాలి. ఇక నుంచి ప్రజలు కూడా తమ ఖాజా మాటలకు మనసారా నవ్వుకోవాల్సిందిగా రోజా అభిమానులు కోరుతున్నారు.













