
జగన్ ప్రభ అడుగంటిపోయిందనేది చంద్రబాబు సభలు చాటి చెబుతున్నాయి. అందుకే.. బాబు రోడ్ షోలు కొనసాగకూడదు. దాని కోసమే ఏపీలో ఎమెర్జెన్సీ విధించేశారు మన జగన్ గోరు. ముఖ్యంగా కుప్పంపై అప్రకటిత యుద్ధమే ప్రకటించాడు. ఇందులో భాగంగానే.. పోలీసులు కాస్త వైసీపీ కార్యకర్తలు అవతారం ఎత్తారు. అయినా జగన్ గోరి హయాంలో ఏం జరిగినా ఆశ్చర్యపొక్కర్లేదు లేండి. ఈ మధ్య అయితే సభలకు వచ్చిన జనం శవాలుగా వెళ్ళడం కూడా సహజం అయిపోయింది. వాటి పై ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే లేడు.
చట్టం అనేది జగన్ గోరి యెదుగూరి సందింటికి ఎదురింటి చుట్టం అయిపోయింది. అందుకేనేమో ఎప్పుడో మూలాన పడిన బ్రిటిష్ చట్టానికి తాజాగా జగన్ గోరు బూజు దులిపి అర్థరాత్రి ఎడాపెడా జీవో ఇచ్చేశాడు. కాబట్టి, ఇక ఆ జీవో ప్రకారం బాబు గారు రోడ్ షోలు చేయడానికి వీలు లేదు. అదే జగన్ కావొచ్చు, జగన్ పార్టీ నాయకులు కావొచ్చు.. రోడ్ షో చేయాల్సిన వచ్చినా,, సభ పెట్టుకోవాల్సి వచ్చినా.. తెల్లారేసరికి కల్లా ఆ జీవో ఉల్లంఘినకు గురి అవుతుంది. వారెవ్వా… ఈ బిహార్ రాజకీయానికి ఏపిలో బలంగా పునాదులు తవ్విన ఘనత ఒక్క జగన్ కే సాధ్యం అయింది. అయినా ప్రతిపక్ష నేత తన నియోజకవర్గంలో పర్యటించేందుకు ఆంక్షలేంటి జగన్ ?, రాష్ట్రం ఏమైనా పులివెందుల జాగీరా..!. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమంత్రి ఇలా తక్కువస్థాయి మనస్తత్వంతో ఉంటే.. రాష్టానికి కనీస ప్రయోజనం ఏమైనా కలుగుతుందా ?, పైగా బాబు సభలకు వచ్చి జనం చచ్చి పోతున్నారు అని ప్రచారం చేస్తోంది జగన్ మీడియా. మరీ ఆ ప్రచారంలో కనీసం నిజం ఉన్నా.. ఆ చావులకు కారణమైన వారి పై జగన్ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకోరు గానీ, సభలను మాత్రం జరగనివ్వరా ?, అసలు జగన్ టార్గెట్ ఒక్కటే. బాబు సభలు ప్రాణాంతకం అని జనం నమ్మాలి. నమ్మించే ప్రయత్నం కూడా విజయవంతంగా జరిగింది. అయినా జనం ఆగేలా లేరు. ఉన్మాది పాలన పై జనం ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఇందులో భాగంగానే బాబు సభలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఆసలకే మోసం వస్తోంది. కాబట్టి.. బాబును జనంలోకి రానివ్వకూడడు. అంతేగా జగన్ !. ఒక్కటి మాత్రం స్పష్టం.
ఎవరైనా సరే ఇలాంటి వేషాలతోనే రాజకీయం చేస్తే.. వచ్చే ఎన్నికల్లో ఆ నాయకుల పార్టీ మట్టిగొట్టుకుపోతుంది. ఎందుకంటే.. కుతంత్రాలు అన్నివేళలా చెల్లుబాటు కావు. అధికారం ఉన్నప్పుడే కార్యకర్తల్ని కొట్టించగలరు, ప్రతిపక్ష నాయకుల్ని నిర్బంధించగలరు. కానీ ఎన్నికల సమయంలో అరాచకాల పై ప్రజావ్యతిరేకత కచ్చితంగా యుద్ధం చేస్తోంది. అప్పుడు తల్లకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ గెలవలేరు. జనం తప్పులను సహిస్తారేమో.. పాపాలను కాదు.













