నటుడు మోహన్‌బాబుకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌

సీనియర్‌ నటుడు మోహన్‌బాబు వైసీపీ పార్టీలో చేరిన దగ్గరనుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అజ్ఞాత వ్యక్తులు గత నెల 26న పలు నెంబర్ల నుండి ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టుగా ఫిర్యాదులో తెలిపారు. ప్రాథామిక విచారణ తరువాత ఆ కాల్స్‌ విదేశాల నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.