HomeTelugu Trendingమహేష్‌ బాబు మేనల్లుడి సినిమాలో జగపతిబాబు

మహేష్‌ బాబు మేనల్లుడి సినిమాలో జగపతిబాబు

9 20

హీరో జగపతిబాబు .. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన తరువాత పెద్ద తరహా పాత్రల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయనను మరోసారి కీలకపాత్ర వరించింది. ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో జగపతిబాబు కూడా నటిస్తున్నారు. రేపటినుంచి హైదరాబాద్ లో జరిగే సెకండ్ షెడ్యూల్ లో జగపతిబాబుపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. గల్లా జయదేవ్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu