గెటప్‌ శ్రీను హీరోగా సినిమా.. గ్లింప్స్‌ విడుదల


‘జబర్దస్త్‌’ నటుడు గెటప్‌ శ్రీను గురించి పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరుకు నవ్వులు పూయించిన శ్రీను.. తాజాగా హీరో అవతారం ఎత్తి అలరించేందుకు సిద్ధమయ్యాడు. గెటప్‌ శ్రీను హీరోగా, కృష్ణమాచారి డైరెక్షన్‌లో ‘రాజుయాదవ్‌’ చిత్రం తెరకెక్కుతోంది. అంకిత ఖారత్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించారు. సాయి వరుణవి క్రియేషన్స్‌ పతాకంపై ప్రశాంత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం పంచుకుంది. ఈ వీడియోలో స్వీటీ.. అంటూ హీరోయిన్‌ వెనకాల రాజుయాదవ్‌ (గెటప్‌శ్రీను) పరుగెత్తుతూ.. కనిపించాడు.

CLICK HERE!! For the aha Latest Updates