అవతార్ సీక్వెల్స్ రిలీజ్ డేట్స్!

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చిత్రం ‘అవతార్’. ఈ సినిమాను చూసిన వారంతా.. అధ్బుతమంటూ ఘన విజయాన్ని అందించారు. జేమ్స్ కేమరూన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా..? అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమాకు ఇప్పుడు నాలుగు సీక్వెల్స్ రాబోతున్నాయి. 2,3,4,5 భాగాలుగా సీక్వెల్స్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆ సీక్వెల్ రిలీజ్ డేట్స్ ను కూడా ప్రకటించింది చిత్రబృందం. అవతార్2 ను డిసంబర్ 18, 2020 లో విడుదల చేయబోతున్నారు. అలానే అవతార్3 ను డిసంబర్ 17 2021లో, అవతార్4 డిసంబర్ 20 2024లో, అవతార్5 డిసంబర్ 19, 2025లో విడుదల చేయనున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఈ భాగాలన్నింటికి సంబంధించిన పనులు ఒకేసారి జరుగుతుండడంతో ప్రాజెక్ట్స్ ఆలస్యమవుతున్నాయని చెబుతున్నారు. మరి ఈ సీక్వెల్స్ ఇంకెన్ని రికార్డ్స్ ను సృష్టిస్తాయో.. చూడాలి!