HomeTelugu Trendingఎన్టీఆర్‌కు జంటగా శ్రీదేవి కూతురు

ఎన్టీఆర్‌కు జంటగా శ్రీదేవి కూతురు

Janhvi kapoor in jr ntr i t

టాలీవుడ్‌ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ’30వ’ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్షన్‌ రానున్న సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. కాగా ఈ సినిమా పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించనున్నాడు త్రివిక్రమ్‌. అందులో భాగంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో రాజకీయ నాయకుడి వారసుడిలా నటించబోతున్నాడట. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా పూజాహెగ్డే, రష్మిక, సమంతల్లో ఎవరో ఒకర్ని ఎంపిక చేయనున్నారట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారట అందులో ఒకరిని బాలీవుడ్ నుంచి తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అందుకోసం జాన్వీ కపూర్ పేరు బాగా వినిపిస్తుంది. అంతే కాదు దాదాపు ఆమెఈ సినిమాలో నటించడం ఖాయమని కూడా అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu