HomeTelugu Big Storiesఎన్టీఆర్‌ 30 ప్రారంభం.. హాజరైన బాలీవుడ్‌ బ్యూటీ

ఎన్టీఆర్‌ 30 ప్రారంభం.. హాజరైన బాలీవుడ్‌ బ్యూటీ

NTR30 launched Koratala Siva makes a bold statement

ఎన్టీఆర్ 30 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదుదరు చూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత ఎన్టీఆర్‌ నటిస్తున్న సినిమా కావడంపై ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా జరుపుకుంది. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో దివంగతన నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. జాన్వీ కూడా ఈ పూజా కార్యక్రమానికి హాజరైంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు మొదటి క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్ కూడా ఈ వేడుకకు హాజరు కావడం మరో విశేషం. మొదటి షాట్ కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.

ntr 30th movie launch

యువ సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ వ్యవహరించనున్నాడు. ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. ఈ పూజా కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్, దిల్ రాజు,శ్రీకాంత్, సితార నాగవంశీ తదితరులు హాజరయ్యారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది.

ఈ సినిమా ఓ కల్పిత దీవి. పోర్టు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ కూడా వేస్తున్నారట. భాగ్య నగరంలో కొంత ఆ తర్వాత ఏపీలోని విశాఖ గోవా ఏరియాల్లో మరికొంత షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu