HomeTelugu TrendingSai Pallavi: మెగా ఫోన్‌ పట్టనున్న బ్యూటీ!

Sai Pallavi: మెగా ఫోన్‌ పట్టనున్న బ్యూటీ!

Sai Pallavi as turned director

Sai Pallavi as turned director: ఫిదా బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఆమె అందంతో.. డ్రెసింగ్‌ స్టైల్‌తో ప్రేక్షకులును ఆకట్టుకుంది. తన పాత్రలను కూడా ఆచితూచి ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నాగచైతన్య ‘తండేల్‌’, తమిళంలో శివకార్తికేయన్‌ సినిమా ఇప్పటికే ఓకే చేసింది. అమీర్‌ఖాన్‌ కొడుకు హీరోగా రూపొందుతోన్న సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

నితేశ్‌ తివారీ డైరెక్షన్‌లో వస్తున్నరూపొందుతోన్న ‘రామాయణం’లో సీతగా నటించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సాయిపల్లవి మరో అడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకూ నటిగా ప్రేక్షకులనూ మెప్పించిన సాయిపల్లవి, త్వరలో మెగా ఫోన్‌ పట్టనుంది.

ఈ విషయాన్ని స్వయంగా ఆమే తెలిపింది. ‘నాకు డైరెక్షన్‌ చేయాలనే ఆలోచన ఉంది. దానికోసం నా అభిరుచికీ, ఆలోచనకూ తగ్గట్టు ఓ కథ కూడా రాసుకుంటున్నాను. ప్రస్తుతం అది ఆలోచన మాత్రమే. మరి నా కథకు నిర్మాతలెవరో నాకే తెలియదు. నాకు తెలిశాక మీకు చెబుతా’ అంది సాయిపల్లవి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu