HomeTelugu Newsవిజయ్‌ దేవరకొండతో జాన్వి కపూర్‌..?

విజయ్‌ దేవరకొండతో జాన్వి కపూర్‌..?

అలనాటి అందల నటి శ్రీదేవి ఒకప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేశారు. సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌గా ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఆమె తెలుగులో తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడతారని అభిమానులు ఆశించేలోపే ‘అతిలోకసుందరి’ అనంతలోకాలకు వెళ్లిపోయారు శ్రీదేవి. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ రాబోతున్నారట. ‘ధడక్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు జాన్వి. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అలా జాన్వి తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది

7 25

అయితే త్వరలో జాన్వి టాలీవుడ్‌ లో కూడా అడుగు బెట్టబోతున్నారట.. యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండకు జోడీగా నటించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తెలుగులో ఒక చిత్రం, తమిళంలో ఒక చిత్రంలో నటించబోతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. తొలి చిత్రంతోనే తన అందంతో కుర్రకారు మనసులను దోచుకున్న జాన్విను తమ తదుపరి సినిమాల్లో కథానాయికగా ఎంపికచేసుకోవాలని దర్శకులు ఆశపడుతున్నారు. ఈ విషయం గురించి జాన్వి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం జాన్వి చేతిలో మరో హిందీ చిత్రం ఉంది. ‘తఖ్త్‌’ అనే చారిత్రక చిత్రంలో జాన్వి నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మించనున్నారు. కరీనా కపూర్‌, విక్కీ కౌశల్‌, ఆలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!