‘జ‌త‌గా’ చిత్రానికి సెన్సార్ యు/ఎ!

రింగులజుత్తు సోయ‌గం నిత్యామీన‌న్ – దుల్కార్ స‌ల్మాన్ కాంబినేష‌న్ అంటేనే యువ‌త‌రంలో విప‌రీత‌మైన‌ క్రేజు. మ‌ల‌యాళంలో వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ల త‌ర్వాత ఈ జంట న‌టించిన ‘ఓకే బంగారం’ తెలుగులో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌. దుల్కార్‌-నిత్యా జంట‌గా న‌టించిన తాజా చిత్రం ‘జ‌త‌గా’. మ‌ల‌యాళంలో జాతీయ అవార్డులు సంపాదించిన ‘ఉస్తాద్ హోట‌ల్‌’ ని ‘జ‌త‌గా’ పేరుతో అందిస్తున్నారు. అన్వర్ రషీద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రేమిస్తే, జ‌ర్నీ, పిజ్జా వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని అందించిన నిర్మాత‌  సురేష్ కొండేటి ఎస్‌.కె.పిక్చ‌ర్స్ ప‌తాకంపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.  ‘జ‌త‌గా’ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు మంగ‌ళ‌వారం(4అక్టోబ‌ర్‌) హైద‌రాబాద్‌లో పూర్త‌య్యాయి. సెన్సార్ యుఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది.  ఈ గురువారం (06-10-16) ‘సంతోషం’ ఎడిట‌ర్ అండ్ ప‌బ్లిష‌ర్‌, ఎస్‌.కె.పిక్చ‌ర్స్ అధినేత‌, నిర్మాత సురేష్ కొండేటి బ‌ర్త్‌డే, తాజా చిత్రం ‘జ‌త‌గా’ సెన్సార్ పూర్త‌యిన సంద‌ర్భంగా..
 
నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ”చ‌క్క‌ని సందేశాత్మక కథాంశంతో రూపొందిన అందమైన ప్రేమకథా చిత్రమిది. పేద, ధనిక వర్గాల మధ్య ఉండే అంతరాలను స్పృశిస్తూ సున్నితమైన భావోద్వేగాలతో దర్శకుడు జనరంజకంగా తీర్చిదిద్దారు. దుల్కార్ సల్మాన్, నిత్యామీనన్ జంట మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌. గోపీసుందర్ బాణీలు సినిమాకి పెద్ద ప్ల‌స్‌. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్‌కి న‌చ్చే పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలున్నాయి. మ‌ల‌యాళంలో  జాతీయ అవార్డులు అందుకున్న ‘ఉస్తాద్ హోట‌ల్‌’ చిత్రాన్ని ‘జ‌త‌గా’ పేరుతో తెలుగులో అందిస్తున్నాం. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ బృందం యుఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ప్రేమిస్తే, జ‌ర్నీ త‌ర‌హాలో అసాధార‌ణ విజ‌యం సాధించే చిత్ర‌మిద‌ని, చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని సెన్సార్ బృందం అభినందించ‌డం ఆనందాన్నిచ్చింది” అన్నారు.
CLICK HERE!! For the aha Latest Updates